hinduBrahmins

---------------------------------------------------------------------------

శౌనకుడు

 
   శౌనకస గోత్రీకులకు శౌనక మహాముని గోత్రపురుషుడు. 

    శౌనక మహాముని పేరు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. దీనికి కారణం ఉంది. మహాభారతాన్ని సూత మహాముని, 'అంత శౌనకాది మునులతో సూతుడిట్లనియె...' అంటూ నైమిశారణ్యంలో చెప్పినట్లుగా నడుస్తుంటుంది. అందుకే, మనకు శౌనక ముని పేరు సుపరిచితంగా ఉంటుంది.

(అన్నట్లు శౌనకాది మునులకు భారతాన్ని చెప్పే సూతుడి అసలు పేరు ఉగ్రశ్రవుడు.)

    విష్ణు పురాణం ప్రకారం అయితే శౌనక మహాముని గృత్సమదుని కుమారుడు. కాదు, ఈయనకే గృత్సమదుడని మరో పేరు ఉందని ఇంకొందరి వాదం. 

    అథర్వ వేదంలో ఒక శాఖకు శౌనకుడే ఆద్యుడు అంటారు. 

    ఋగ్వేద ప్రతియాఖ్య, బృహద్దేవత, చరావ్యాహ వంటి గ్రంథాలను రాసిన వాడు శౌనకుడు. అసలు ఋగ్వేదంలోనే బాస్కల, షాకల శాఖలను సమ్మిళితం చేసిన ఖ్యాతికూడా శౌనకునిదే! 

    మానవ జన్మలో ప్రతీ వారికీ నాలుగు స్థాయులు ఉంటాయని వివరించిన వాడు శౌనకుడు.

    ఈయన కాత్యాయనుడు, అశ్వలాయనులకు గురువు. 

----------------------------------------------------------------------

Copyright Reserved