hinduBrahmins

-------------------------------------------------------------------------------------------శాండిల్యుడు

    'శాండిల్య' అంటే పూర్ణ చంద్రుడు అని అర్థం. 'శాన్‌' అంటే పూర్ణ అని, 'డిలమ్‌' అంటే చంద్రుడు అని అర్థం.

    వేదాలలో మనకు ఇద్దరు శాండిల్యులు దర్శనం ఇస్తున్నారు. 

    ఒక శాండిల్యుడు 'శాండిల్యోపనిషత్‌' కర్త. కాశ్యపుని మనుమడు, అసితుని కుమారుడు. బృహదారకారణ్యం ఇతడినే వ్యాత్స(వత్స) ఋషి శిష్యుడిగా పేర్కొంటోంది. ఇతనినే కౌశికుడు, గౌతముడు, కౌశోర్య కాప్య, వత్స్యవాజపేయ. కుశి మహర్షుల శిష్యుడుగా కూడా చెప్తారు. ఇతనికి అగ్నివేశుడు, కౌండిన్యుడు, వత్స్య వామాకాక్షాయణుడు, వైష్ఠపురేయ, భరద్వాజులను శిష్యులుగాకూడా చెప్తారు. ఇతడే మహాభారతంలోని పరీక్షిత్‌ మహారాజు ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ద్వాపరరాజు వజ్రుడికీ సమాధానాలు చెప్తాడు. 

    మరొక శాండిల్యుడు వశిష్ఠుని కుమారుడు. ఈయన కాశ్మీర్‌ ప్రాంతంలోని బొలైర్‌ లోయలోని శారదావనంలో నివాసం ఉండేవాడు. ఇదే 'శారదావనం' ఇప్పుడు ఆజాద్‌ కాశ్మీర్‌లోని కిషన్‌గంగ నది ఒడ్డున ఉన్న శర్దా నగరం. శాండిల్యునికి శారదాదేవి దర్శనం ఇచ్చి, యజ్ఞోపవీతం ప్రసాదించింది కనుక, ఇది 'శారదావనం' అయిందంటారు. 

    శాండిల్యుడిని తమ గోత్రపురుషుడుగా పేర్కొనేవారిలో మనకు నాలుగు ప్రవరలు కనిపిస్తున్నాయి. 

    ఒక ప్రవరలోని త్రయార్షులు: 
        1. కాశ్యప, ఆవత్సర, దైవల


మరొక ప్రవరలోని త్రయార్షులు:   

        1. కాశ్యప, ఆవత్సర, శాండిల్య


    ఇంకొక ప్రవరలోని త్రయార్షులు:   

        1. కాశ్యప, దైవల, అసిత

    నాలుగో ప్రవరలోని సప్త ఋషులు: 

         1. కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ,  రైభ, శండిల, శాండిల్య.

    శాండిల్యుని పూర్వీకులుగా కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, శండిల, శాండిల్యలను చెప్తారు. 

    పరమ శివుని సతీమణి పార్వతి గోత్రం శాండిల్య.

------------------------------------------------------------------------------

Copyright Reserved