hinduBrahmins

------------------------------------------------------------------శఠమర్షణుడు


    శఠమర్షణుడి గురించిన వివరాలు మనకు చాలా తక్కువగానే లభిస్తున్నాయి. 

    'శఠం' అంటే కోపం అని అర్థం. 'శఠమర్షణుడు' అంటే 'కోపాన్ని నిగ్రహించుకున్నవాడు' అన్న అర్థం కావచ్చు.

    శఠమర్షణుడికన్నా ముందు ఈ గోత్రంలో ఆంగిరసుడు, పురుకుత్సుడు, త్రశదస్యులు వంటివారు ఉండేవారనీ, వారిని అధిగమించి, శఠమర్షణుడు గోత్రపురుషుడు అయ్యాడని ఒక వాదం. 

    శ్రీవైష్ణవ సంప్రదాయంలో శఠమర్షణుడిగురించి కొన్ని వివరాలు లభిస్తున్నాయి. వాటి ప్రకారం అయితే, 74మంది మొదలి (ప్రథములు)లలో నాదముని, యామునాచార్యులు ఈ శఠమర్షణ గోత్రీకులు. 

    శఠమర్షణ గోత్రీకులను తమిళనాడులో 'శ్రేష్ఠులు' అంటారనీ       ఉంది. తమిళంలోనే అయితే వీరిని 'సొట్టై కుళమ్‌' అంటారు. ఈ పదం గురించీ ఒక కథ ఉంది. వైష్ణవ ఆచార్యులైన యామునాచార్యులవారు తనగురించి రాసుకుంటూ ఒకచోట 'సొట్టై నంబి' అని రాసుకున్నారట. అంటే 'బట్ట తల గల నంబి' అని అర్థం. పన్నిద్దరు (12మంది) ఆళ్వారులలో ఒకరైన యామునాచార్యుల వారినే 'అలవందర్‌' అనీ అంటారు. తిరుమలకు కాలిబాటన వెళ్లేవారు శఠమర్షణ గోత్రికుడైన యామునాచార్యుల వారి విగ్రహాన్ని చూడవచ్చు. 

--------------------------------------------------------------------------------

​Copyright Reserved