​​​​బమ్మెర పోతన 
'శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర 
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో 
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్దృగ్జాల సంఘాతనా 
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్ '

 
- అని ఆరంభం అవుతుంది బమ్మెర పోతన వారి శ్రీ మహా భాగవతము. 

'మన జాతి ఔన్నత్యాన్ని పెంపొందించి, మన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచనలు ఏవి అన్నప్పుడు రామాయణ, భారత, భాగవతాలు అని దాదాపుగా ప్రతివారూ అతి సునాయాసంగా చెప్పగలరు. రామాయణము ఒక కుటుంబ వ్యవస్థకు అక్షరాకృతి అయితే, భారతం ఒక సమాజానికి నిలువుటద్దంలా నిలిచింది. ఇక, ముచ్చటైన మూడవది భాగవతం. ఇది తెలుగువారి ఆధ్యాత్మిక చింతనకు, భక్తి భావనకు ప్రతీకగా వెలసింది.' అని హైద్రాబాద్  లోని తెలుగు విశ్వ విద్యాలయం వారు ప్రచురించిన 'శ్రీ మహాభాగవతము' మొదటి సంపుటం ప్రకాశక విజ్ఞప్తిలో పేర్కొన్నారు. వేదవ్యాస మహర్షి సంస్కృతంలో రాసిన 'శ్రీ మహాభాగవత' గ్రంథాన్ని తెనిగీకరించిన మహానుభావుడు బమ్మెర పోతన.  
భాగవతాన్ని 'ఏడు రోజులు భక్తిమై వినిన మోక్షము కరతలామలకమగును. వేదాంత శ్రవణ గీతాపారాయణములచే  గూడ లభించని భక్తిజ్ఞాన వైరాగ్యములు భాగవత శ్రవణముచే దప్పక లభించి ముక్తిమార్గము జూపును. అందుచేతనే 


'నిగమములు వేయి జదివిన, సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్ 
సుగమంబు భాగవత మను , నిగమంబు పఠియింప ముక్తి నివసనము  బుధా '

అని చెప్పబడింది.  (అదే పుస్తకం, పీఠిక పేజీ 9)

భాగవతాన్ని ఆంధ్రీకరించినవాడు బమ్మెర పోతన. ఈయన దేశకాలాల గురించి చాలా వాదోపవాదాలు జరిగాయి. 


పోతనది కౌండిన్య గోత్రం, ఆపస్తంబ సూత్రము. ఆయన తండ్రి కేసన, తల్లి లక్కమాంబ (లక్ష్మమ్మ). ఈయన సోదరుడు (అన్న) తిప్పన .  

వీరి వంశమువారు వీరశైవులు అయినప్పటికీ భాగవత రచనాకాలం నాటికీ పోతన, హరిహరులకు భేదాన్ని పాటించని అద్వైతిగా మారినట్లుగా ఒక కథనం ఉంది. పోతనగారి గురువు ఇవటూరి సోమనారాధ్యుడు. పోతనకు అప్పలమ్మ, వీరాంబ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. అప్పలమ్మవల్ల పోతనకు 'ప్రౌఢ సరస్వతి' అనే బిరుదుగల కేసన, వీరాంబవల్ల మల్లన అనే కుమారులు ఉన్నట్లు అనేక ఆధారాలవల్ల తెలుస్తోంది.  

అయితే, పోతన మనుమడు ప్రౌఢ సరస్వతి అని, మునిమనమలు కేసన, మల్లన కవులనే ఇంకొక వాదం ఉంది. ('విజ్ఞాన సర్వస్వం' లో గడియారం వెంకట శేషశాస్త్రి వారి వ్యాసం, పేజీ 932). 
 
పోతన సహజ పాండిత్యుడు. భాగవతము కాకుండా పోతన రచనలుగా 'వీరభద్ర విజయము', 'భోగినీ దండకము', 'నారాయణ శతకము' అనే మూడు కృతులను పేర్కొంటారు. పోతన మొదట భోగినీ దండకమును, తర్వాత భాగవతాన్ని, ఆ తర్వాత వీరభద్ర విజయమును రాసినట్లు అంటారు. భోగినీ దండకాన్ని సర్వజ్ఞ సింగ భూపాలుడు రాయించుకున్నట్లు చరిత్ర చెప్తోంది. భాగవతాన్ని మాత్రం పోతన, 'ఇమ్మనుజేశ్వరమ్ములకిచ్చి .. ' నరాంకితం చేయనని పట్టుపట్టినట్లు చరిత్ర. 

పోతన హాలికుడు. రైతుగా ఉండటం చిన్నతనంగా భావించని పెద్దవాడు. 
'సత్కవుల్ హాలికులైననేమి, 
గహనాంతర సీమల కందమూల గౌద్దాలికులనైననేమి  
నిజదార సుతోదర పోషణార్థమై..'
అని వినయంగా చెప్పుకున్నవాడు. 

తన కవిత్వ సుధారాలతో సరస్వతీ మాతకు నీరాజనాలు పలికినవాడు. కానీ, తానేదీ పలకటం లేదని నిగర్వంగా చెప్పుకున్నవాడు. 
'పలికెడిది భాగవతమట 
పలికించెడువాడు రామభద్రుండట 
పలికిన భవహరమగునట 
పలికెద వేరొండు గాథ పలుకగనేలా
' అనుకున్నవాడు. 

అక్షరాలా, (అక్షరాల) తల్లి సరస్వతి కన్నీరు పెట్టుకుంటే, 
'కాటుక కంటినీరు చనుకట్టుయింపడ నేల నేడ్చెదో 
కైటకదైత్య మర్దనుని గాదిలికోడల, ఓ మదంబ , ఓ 
హాటుకగర్భురాణి, నిను నాకటికిన్ గొనిపోయి యల్ల క 
ర్ణా కిరాత కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ' 

- అని కన్నీరు తుడిచి ఓదార్చినవాడు పోతన.

మహాభాగవతములో - ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, నరకాసురవధ, కుచేలోపాఖ్యానము, శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, రాసక్రీడలు, గోపికాగీతాలు, భ్రమర గీతాలు - వంటి అద్భుతాలు అనేకం. ఒక్కొక్క ఘట్టంలోనూ పోతన రాసిన పద్యగద్యాలు తెలుగువారి హృదయాలను భక్తిపారవశ్యంలో ముంచెత్తి ముక్తిని ప్రసాదించే క్షీరామృతాలు; వారి మనసులలో నిత్యమై నిలిచిన మధురసుగంధాలు. 


​'నన్నయ ధారాశక్తి, తిక్కన రసస్ఫూరితబంధము, ఎఱ్ఱన సూక్తివైచిత్రి, (నాచన) సోముని సాహితీ విదగ్ధత, శ్రీనాథుని క్రొత్త ఎత్తుగడలు.. అన్నియూ నొక మూసలో గరఁగినచో పోతన శైలి పాంచభౌతిక శరీరమగును' అంటారు గడియారం వారు తమ వ్యాసంలో. 

'పోతనామాత్యుడు పుణ్యశాలి. శైవుల ఇంటనే పుట్టెను. కానీ, వీరభద్ర పళ్ళెము లెత్తి 'హరోంహర' యని ఊరేగుచున్న నాటి మతోన్మాదమునకు ఓపలేకపోయెను. వైష్ణవమును స్వీకరించెను. మహాభాగవతమును తెనిగించి మాతృభాషను మధుమయము చేసి, వైకుంఠములో హరి సంకీర్తన మాచరించుటకు తరలిపోయెను' అన్న పీఠిక (శ్రీ మహాభాగవతము, పేజీ 69)లోని వాక్యాలు అక్షరసత్యాలు. పోతనామాత్యులకు అవి అక్షరనీరాజనాలు. మహాభక్తుడై, మహాకవియై పోతనామాత్యుడు, ప్రజాహితార్థం సురభాష నుంచి నేలకు దించుకొని వచ్చిన పారిజాతం వంటిది - శ్రీ మహాభగవతము. ​
hinduBrahmins

T
l¿Õe\«|Ÿ<Š+‹T CñsÁT³Å£”HîÕ º+Ü+#î<ŠHŽ ýË¿£sÁ
¿Œí¿±sÁ+uó„Å£” uó„¿£ïbÍ\q ¿£Þ²dŸ+sÁ+uó„Å£”HŽ <‘qyÃ
ç<û¿£ dŸï+uó„Å£” ¹>[ýË\$\dŸ<ŠÝ >±¨\ dŸ+|˜ŸÖÔáH
H¿£+C²Ôáuó„y+&ƒÅ£”+uó„Å£” eTVŸäq+<‘+>·H&ó+uó„Å£”HŽµ
n“ €sÁ+uó„+ neÚÔáT+~ ‹yîTˆsÁ bþÔáqy] l eTVŸä uó²>·eÔáeTT. 
ype your paragraph here.