hinduBrahmins
Type your paragraph here.
ప్రపంచానికి చాటుదాం బ్రాహ్మణుల ఘనత!!
'బ్రహ్మణ్యో, బ్రహ్మకృత్, బ్రహ్మా
బ్రహ్మ, బ్రహ్మవివర్ధన:
బ్రహ్మవిత్ బ్రాహ్మణో, బ్రహ్మీ,
బ్రహ్మజ్ఞో, బ్రాహ్మణప్రియ:'
తెలుగు బ్రాహ్మణులు- తెలుగు నేలకూ, తెలుగు జాతికీ, తెలుగు సాహితీసంస్క ృతీవికాసాలకూ చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేనివి; మర్చిపోరానివి. కానీ, దురదృష్టవశాత్తూ బ్రాహ్మణుల, మరీ ముఖ్యంగా తెలుగు బ్రాహ్మణుల బహుముఖీనమయిన సేవలను, అనేకానేక కారణాలవల్ల ఈ తెలుగుజాతి విస్మరించే ధోరణిలో పడుతోంది. కనీసం, మన బ్రాహ్మణులయినా, మనవారి ఔన్నత్యాన్ని మనసా వాచా తలుచుకుంటూ, ఆ వారసత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలోనే తరతరాల తెలుగు ప్రముఖుల చరిత్రను, కొండ అద్దమందు కొంచమై ఉండదా అనే రీతిలో, ఆ ప్రజ్ఞావంతుల చరిత్రను సూక్ష్మంగానైనా నిక్షిప్తం చేయాలనే ఆలోచనతో ఆరంభం అయిన బృహత్తర కార్యక్రమమిది.
తెలుగు జాతికి -
సాహిత్యం (ఉదా: నన్నయ, తిక్కన, ఎర్రన, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, మునిమాణిక్యం వగైరా),
పాండిత్యం (దివాకర్ల వేంకటావధాని, ఆరుద్ర),
సంగీతం (మారెళ్ల కేశవరావు, ఈమని శంకరశాస్త్రి, ఎమ్. చిత్తరంజన్),
చిత్రలేఖనం (దామెర్ల రామారావు, బాపు, అడవి బాపిరాజు),
నాటకం (ధర్మవరం కృష్ణమాచార్యులు, ఆచార్య ఆత్రేయ),
చలనచిత్రం (చిత్తూరు నాగయ్య, సముద్రాల, కె. విశ్వనాథ్),
పత్రికామీడియా రంగాలు (శివలెంక శంభుప్రసాద్, ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ),
సంఘ సంస్కరణం (కందుకూరి వీరేశలింగం),
శాస్త్రసాంకేతిక పరిశోధనారంగం (ఎల్లాప్రగడ సుబ్బారావు),
పారిశ్రామిక రంగం (కాశీనాథుని నాగేశ్వరరావు),
సేవారంగం (డొక్కా సీతమ్మ),
సంఘసేవ (కె.వి. రమణాచారి),
రాజకీయం (వి.వి. గిరి, పి.వి.నరసింహారావు, టంగుటూరి ప్రకాశం, వల్లూరి బసవరాజు) -
-ఇలా ఏ రంగంలో సేవ చేసిన తెలుగు బ్రాహ్మణులు ఏ తరం వారయినా, వారి చరిత్రను, ఇప్పటికే బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసే కృషి చేస్తున్న ఒక వెబ్సైట్ (www. hindubrahmins.com))లో ఇంటర్నెట్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన దాచి ఉంచాలనే తపన ఇది. వీలైతే, సమీప భవితవ్యంలో ఆ వివరాలతో ఒక సర్వస్వాన్ని కూడా ప్రచురించే యోచన చేద్దాం. మీ దృష్టిలో ఉన్న మహానుభావులు ఎవరైనా, వీలైతే, వారి గోత్రప్రవరలతోబాటు వారి చరిత్ర, వీలైతే ఫొటోలతో (సజీవులయి ఉంటే వారి చిరునామా, సెల్ ఫోన్ లేదా ఏ విధంగా వారిని సంప్రదించవచ్చో, ఆ చిరునామా, తదితరాలతో) సహా మాకు పంపండి. ఆదికవి నన్నయ భట్టారకునివారి నుంచి నేటి కొత్తతరం ప్రతినిధులవరకూ.. స్త్రీ పురుష భేదాలూ, శాఖలూఉపశాఖలూ, పల్లెలుపట్నాలూ, రాష్ట్రాలూప్రాంతాలూ అనే తారతమ్యాలూ లేకుండా.. బ్రాహ్మణులు.. స్వచ్ఛందంగా ఎవరు పంపే వివరాలకైనా స్వాగతమే!
ఒకవేళ, మీరే తెలుగుజాతికి అద్భుతమయిన సేవ చేశామన్న భావన మీకు ఉంటే, నిరభ్యంతరంగా మీ ఫొటోతోబాటు, సంక్షిప్తంగా, మీగురించే రాసి పంపండి. మన తెలుగు బ్రాహ్మణుల ఘనత ఏమిటో ఘనంగా చాటిచెబుదాం; గర్వంగా ముందు తరాలకు అందించుదాం. ఒకవేళ, మీకు బ్రాహ్మణులలో ఇతర మహానుభావుల వివరాలు పూర్తిగా తెలియపోతే, కనీసం వారి పేరు, ప్రతిభారంగం అయినా రాసి పంపండి. వారి వివరాలనుకూడా సేకరించే ప్రయత్నాలు మనం చేపడదాం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కులాలవారిని కించపరచడంకానీ, వారిని తూలనాడటంకానీ, దూషించడం కానీ ఆమోదయోగ్యం కాదు. బ్రాహ్మణులు గొప్పవారంటే మేం సంతోషిస్తాం కానీ, ఇతరులు కాదంటే తప్పే. ఆ వాదాన్ని మేం అంగీకరించం! ఈ విషయంలో వాదోపవాదాలు కూడా అనవసరం. మీకు ఇది అంగీకారయోగ్యం అయితేనే, మీరు వివరాలు పంపండి. తగినవిధంగా ఆ వివరాలను ఎడిట్ చేసుకుని ఇప్పటి వెబ్సైట్ (www. hindubrahmins.com)లోనూ, తర్వాత కాలంలో తగిన పేరు, శీర్షికలతో మేం ప్రచురించే అవకాశం ఉన్న సర్వస్వంలోనూ ప్రచురించుకునే హక్కు మాకు ఉంటుందని గుర్తించండి, మీ వివరాలను మాకు పంపడమే మా హక్కులకు మీరు ఆమోదం తెలిపినట్లుగా మేం భావిస్తాం, వివరాలను స్వీకరిస్తాం.
ఇది ఏ ప్రభుత్వపరంగానూ జరుగుతున్న ప్రయత్నం కాదు; కేవలం మన బ్రాహ్మణుల ఔన్నత్యంకోసం శ్రమిస్తున్న ఔత్సాహికుల కృషి మాత్రమే!
మా చిరునామా, ఈమెయిల్ ఐడి : greattelugubrahmins@gmail.com
'ఆంధ్రమహాకవులకు ఆద్యుడు, ఆంధ్రమహాభారత సౌధనిర్మాణ ప్రథమశిల్పి' అయిన నన్నయ భట్టారకునితోనే సుప్రసిద్ధ తెలుగు బ్రాహ్మణుల చరిత్రకు నాంది పలకటం ఔచిత్యంగా ఉంటుందన్న ఆలోచనతో, ఆ మహానుభావునికి పాదాభివందనంతో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుడుతున్నాం. మీ సహకారాన్నీ, ఆదరణనూ అర్థిస్తున్నాం.
---------------------------