hinduBrahmins

తెలుగు బ్రాహ్మణుల ఇంటిపేర్లు

తెలుగు బ్రాహ్మణుల ఇంటిపేర్లను, వాటితోబాటుగా వారి శాఖలను, గోత్రాలను ఒక్కచోట సంకలనం చేయ ప్రయత్నించటం ఎంతో శ్రమ, పరిశ్రమలతో కూడిన పని. ఈ గొప్ప పనిని చేసిన ఘనత మాన్యులు శ్రీ ఎమ్మెస్రాయ్‌ శాస్త్రిగారు, శ్రీ మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద శాస్త్రిగారు, శ్రీ నిష్ఠల దుర్గామల్లికార్జున శర్మగారు వంటి ఎందరో పెద్దలకు చెందుతుంది. ఈ కోణంలో ఆ మహామహుల ఆలోచన, శ్రమ, పరిశోధనలకు వివిధ శాఖలకు చెందిన తెలుగు బ్రాహ్మణులు అందరూ ఋణపడి ఉండాలి. 
    విప్రకుల దర్పణము, బ్రాహ్మణ రాజ్య సర్వస్వం, బ్రాహ్మణోత్పత్తి మార్తాండం, బ్రాహ్మణ సర్వస్వం వంటి అనేక గ్రంథాలను, గతంలో ఎందరో పెద్దలు సేకరించిన గృహనామ శాఖాగోత్ర వివరాలను, అనేక ఇతర వివరాలను ఆధారం చేసుకుని, ఈ తెలుగు బ్రాహ్మణుల ఇంటిపేర్లు, శాఖలు, గోత్రవివరాలను అందిస్తున్నాము. ప్రపంచవ్యాప్తం అయిన తెలుగు బ్రాహ్మణులకు ఈ పట్టిక సహాయపడుతుందని ఆశిస్తున్నాము. తెలుగు అక్షరక్రమంతో ఉండే ఈ పట్టికను క్రమక్రమంగా మరింత తీర్చిదిద్దగలమని ఆశ. మీకు ఎక్కడైనా సందేహాలు ఉన్నా, మీరు మరిన్ని వివరాలు అందించదలచినా మమ్మల్ని సంప్రదించ ప్రార్థన. .