hinduBrahmins

-------------------------------------------------------------------------------------గార్గేయుడు

    భరద్వాజుడు, ఆయన భార్య సుశీలల కుమారుడు గర్గ. 

    గర్గుడు నందమహారాజుకు పురోహితుడు. దేవకీవసుదేవులు తమకు కంసుని కారాగారంలో జన్మించిన కుమారుడిని రేపల్లెలోని నందుని ఇంట వదులుతారు. అప్పుడు ఆ బాలుడికి 'శ్రీ కృష్ణుడు' అని పేరు పెట్టింది గర్గుడే. 'గర్గ సంహిత' కర్త. అథర్వ వేదంలో కొన్ని సూక్తాలకు కర్త.     

    గర్గుడు మంచి జ్యోతిషశాస్త్రవేత్త. పరాశరుడు తన 'బృహత్‌ హోరా శాస్త్ర' గ్రంథంలో ఒక వ్యక్తి జాతకంలో 10వ గృహం (దశమ గృహం) ప్రభావాన్ని వివరిస్తున్న సందర్భంలో గర్గుడిని, బ్రహ్మను ఉటంకిస్తాడు. 

    గర్గుడి కుమారుడు గార్గ్య. ఈయనే గార్గేయస గోత్ర ఆదిపురుషుడు. 

    గర్గుడికి పరమశివుడు అర్థనారీశ్వరుడిగా దర్శనం ఇచ్చిన చోటుగా, మైసూర్‌కు సమీపంలో శ్రీ ప్రసన్న పార్వతీ సమేత గార్గేశ్వరీ ఆలయం ఉంది.

యాజ్ఞవల్క్య - గార్గి సంవాదం
    గర్గ వంశంలో జన్మించినవారిలో సుప్రసిద్ధురాలు గార్గి. ఆమె పూర్తి పేరు
గార్గి వాచజ్ఞవి. విశ్వవిఖ్యాతమైన వేదాంతురాలిగా ఆమె సుప్రసిద్ధం.

ఆమె తండ్రి వచజ్ఞుడు. గార్గి ప్రస్తావన మనకు బృహదారణ్యక ఉపనిషత్‌, 6, 8 బ్రాహ్మణాలలో కానవస్తుంది. ఆమె 'గార్గి సంహిత' కర్త. 

    విదేహ రాజు జనకుడు కొలువులో ఉన్న నవరత్నాలలో ఒకరు ఆమె. ప్రప్రథమ ప్రపంచ వేదాంత మహాసభలలో ఆమె పాల్గొన్నారు.

జనకుడు ఏర్పాటు చేసిన బ్రహ్మయజ్ఞంలో ఆమె, యాజ్ఞవల్క్యుని వాదాలతో విభేదించి, ఆత్మగురించి సుదీర్ఘ వాదోపవాదాలు చేశారు.

వాటిగురించి యాజ్ఞవల్క్యుడు తన 'యోగ యాజ్ఞవల్క్య'లో రాశారు. ఆ చర్చలో గార్గి తన ఓటమిని అంగీకరించి, యాజ్ఞవల్క్యునికి తగిన సత్కారం చేయవలసిందిగా జనకుని కోరుతుంది. అప్పుడు జనకుడు, యాజ్ఞవల్క్యునికి 1000 గోవులు, 10వేల సువర్ణ నాణాలు ఇస్తారు. అయితే, యాజ్ఞవల్క్యుడు తనకు ఆ కానుకలు ఏవీ అవసరం లేదని, తన తపస్సును కొనసాగించటానికై అడవికి తన భార్య మైత్రేయితో సహా వెళ్లిపోతాడు. 

                                                               


                                                                                      *     *     *     *     *

-----------------------------------------------------------------------

Copyright Reserved