hinduBrahmins

వివిధ  పాంతాలలో బ్రాహ్మణులు

'రాజతరంగిణి' కావ్యంలో కల్హణుడు సవివరంగా పేర్కొన్నట్లుగా అఖండ భారతంలోని అన్ని ప్రాంతాలలోనూ బ్రాహ్మణులు విస్తరించి  ఉన్నారు. ఉత్తర భారతంలో సారస్వత, కన్యాకుబ్జ, గౌడ, ఉత్కళ, మైథిలి అనే పేర్లమీద పంచగౌడులుగా, దక్షిణ భారతంలో కర్ణాటక, తెలుగు, ద్రవిడ, మహారాష్ట్ర, గుజరాత్‌ పేరిట పంచ ద్రావిడులుగా ఉన్న బ్రాహ్మణులు, భారతావనికి ఆవల ఉన్న దేశాలలోనూ ఉన్నారు. నేపాల్‌లో 'బహున్‌'లుగా, ఒకప్పటి బర్మా అయిన నేటి మయన్మార్‌లో 'పొన్న'లుగా వివిధ పేర్లతో బ్రాహ్మణులు ఉన్నారు. 

పైన పేర్కొన్న విభాగాలుగానే కాకుండా, ఇతర విధాలుగా కూడా బ్రాహ్మణులు పలు తెగలుగా విభజితం అయి ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే - ఉత్తరాదికి చెందిన ఒక్క సారస్వత బ్రాహ్మణులలోనే చాలా తెగలు ఉన్నాయి. వీటిలో-

1. కన్యాకుబ్జ బ్రాహ్మణులు
2. సరయూపరీన్‌ బ్రాహ్మణులు
3. జైస్వాల్‌ బ్రాహ్మణులు
4. సనాధ్య బ్రాహ్మణులు
5. భూమిహార్‌ బ్రాహ్మణులు
6. బెంగాల్‌ బ్రాహ్మణులు
7. బహున్‌ బ్రాహ్మణులు

ఇవికాకుండా సారస్వత బ్రాహ్మణులలోనే, వేరే తరహా వర్గవిభేదాలూ ఉన్నాయి. 

1. సారస్వత బ్రాహ్మణులు
2. గౌడ సారస్వత బ్రాహ్మణులు
3. ఛత్రపూర్‌ సారస్వత బ్రాహ్మణులు
4. రాజ్‌పూర్‌ సారస్వత బ్రాహ్మణులు. 

వీరు కాకుండా, దక్షిణ భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులలోగల విభాగాలగురించి ఇప్పుడు చూద్దాం: 


దక్షిణాది బ్రాహ్మణులు 

    దక్షిణాది బ్రాహ్మణులలో ప్రధానమైన విభాగాలు మూడు: 

    1. స్మార్తులు     2. వైష్ణవులు    3. మధ్వులు. 

    ఈ విభాగాలు వారువారు పాటించే గురు సంప్రదాయ (శంకర, రామానుజ, మధ్వ) పద్ధతిని బట్టి ఏర్పడ్డాయి.

    మరో పద్ధతి ప్రకారం, ఆయా ప్రాంతాలనుబట్టి బ్రాహ్మణులను పేర్కోవటమూ ఉంది. కిందటి అధ్యాయంలో ఉటంకించిన శ్లోకం ప్రకారం దక్షిణాదిన ఐదు విభాగాలు ఉన్నాయి. ఆ శ్లోకం ఇది:

        'కర్ణాటకాశ్చ తైలంగా ద్రావిడ మహారాష్ట్రకాః
          గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడావింధ్యదక్షిణే
          సారస్వతా కన్యాకుబ్జా గౌడా ఉత్కళ మైథిలాః
          పంచగౌడా ఇతి ఖ్యాతా వింధ్యస్యోత్తర వాసినః'


ఆ విభాగాలు: 

    1. కర్ణాటక బ్రాహ్మణులు
    2. తెలుగు బ్రాహ్మణులు
    3. ద్రవిడ బ్రాహ్మణులు
    4. మహారాష్ట్ర బ్రాహ్మణులు
    5. గుర్జర (గుజరాతీ) బ్రాహ్మణులు. 

    ఈ విభాగాలగురించి స్థూలంగా చూద్దాం. మనం ప్రధానంగా తెలుగు బ్రాహ్మణుల గురించి పరిశీలిస్తున్నాం కాబట్టి, ముందుగా ఇతర ప్రాంతాలవారి గురించి దృష్టి సారించి, తర్వాత అధ్యాయాలలో తెలుగు బ్రాహ్మణుల గురించి చూద్దాం:

కర్ణాటక బ్రాహ్మణులు

    కర్ణాటక బ్రాహ్మణులలో ముఖ్య విభాగాలు రెండు. అవి: 1. స్మార్త బ్రాహ్మణులు, 2. మధ్వ బ్రాహ్మణులు.

    స్మార్త కర్ణాటక బాహ్మణులలో మళ్లీ ఐదు విభాగాలు. అవి:

    1. హోసల్‌నాడు బ్రాహ్మణులు
    2. కమ్మె బ్రాహ్మణులు. వీరిలో మళ్లీ మూడు తెగలు. అవి: 
            1. ఉల్చ, 2. బుబ్బూరు, 3. కరణ బ్రాహ్మణులు.
    3. సీర్నాడు బ్రాహ్మణులు
    4. అరవత్తు వక్కళు బ్రాహ్మణులు 
    5. బడగనాడు లేదా బళగనాడు బ్రాహ్మణులు.

ఇక, మధ్వ కర్ణాటక బ్రాహ్మణులలో ఏడు తెగలు ఉన్నాయి. అవి:

    1. ఆరువేల బ్రాహ్మణులు
    2. హైదరాబాదీ లేదా మనవరక్కుట్టమ్‌ బ్రాహ్మణులు
    3. పెన్నతురర్‌ బ్రాహ్మణులు
    4. అరవత్తు వక్కళు బ్రాహ్మణులు.

                            వీరిలో మళ్లీ రెండు తెగలు:  1. శాస్తిగళ్‌, 2. కంబళ్‌ బ్రాహ్మణులు.
    5. బడగనాడు లేదా బళగనాడు కర్ణాటక బ్రాహ్మణులు.
    6. తొళువర్‌ కర్ణాటక బ్రాహ్మణులు. (వీరు మాట్లాడే భాష తుళు.)
    7. ప్రథమ శాఖ బ్రాహ్మణులు.

    మధ్వ కర్ణాటక బ్రాహ్మణులు ప్రధానంగా 4 మఠాలకు అనుబంధితమయి ఉంటారు. ఆ మఠాలు ఇవి: 

    1. ఉత్తరాది మఠం (దీని ప్రధాన పీఠం మైసూర్‌ ప్రాంతంలోని హోళియ నరసింహపురం. దీనికి ఆరువేల కర్ణాటక బ్రాహ్మణులు, హైదరాబాదీ కర్ణాటక బ్రాహ్మణులు అనుయాయులు.) 
2. వ్యాసరాయ మఠం (ప్రధాన పీఠం సొసలై. పెన్నతురర్‌ అరవత్తు వక్కళు, శాస్తిగళ్‌, కంబళ్‌, బళగనాడు కర్ణాటక బ్రాహ్మణులు ఈమఠానికి అనుబంధితమయి ఉంటారు.)
    3. ముళుబగళు మఠం (ఇది ఒకప్పుడు వ్యాసరాయ మఠంలో భాగంగా  ఉండేది. ఈ మఠానికి ప్రధాన కేంద్రం మైసూరుకు సమీపంలోని ముళుబగళు.)
    4. సుమతేంద్ర మఠం. (వీరి ప్రధాన కేంద్రం నంజన్‌గూడ్‌).

    అయితే, శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యంగారు తమ 'వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు' పుస్తకం (పే. 84)లో కర్ణాటక బ్రాహ్మణులలో ఏడు తెగలు ఉన్నారని రాస్తూ, ఎనిమిది తెగల వివరాలు ఇచ్చారు. వారి లెక్కల ప్రకారం 1. అరవతొక్కులు, 2. ఉరిచి బ్రాహ్మణులు, 3. కన్నడ బ్రాహ్మణులు, 4. కుమ్మె బ్రాహ్మణులు, 5. నగర బ్రాహ్మణులు, 6. బొబ్బర బ్రాహ్మణులు, 7. మాధ్వ బ్రాహ్మణులు, 8. శ్రీ వైష్ణవులు. 

    వీరిలో 'అరవ తొక్కులు' అనేవారు బహుశా, 'అరవత్తు వక్కళు బ్రాహ్మణులు' కావచ్చు. అలాగే, 'ఉల్చ బ్రాహ్మణులు' ఉరిచి బ్రాహ్మణులు గానూ, 'బబ్బూరు బ్రాహ్మణులు' బొబ్బర బ్రాహ్మణులుగానూ, 'మ్మె బ్రాహ్మణులు' కుమ్మె బ్రాహ్మణులుగానూ వ్యవహారంలోకి వచ్చి ఉండవచ్చు.  

మహారాష్ట్ర బ్రాహ్మణులు

    వీరిలోనూ రెండు తెగలు ఉన్నాయి. అవి: 
    1. మహారాష్ట్ర మధ్వ దేశస్థ బ్రాహ్మణులు
    2. మహారాష్ట్ర స్మార్త దేశస్థ బ్రాహ్మణులు. 

    మహారాష్ట్ర మధ్వ బ్రాహ్మణులు ఉత్తరాది మఠానికి చెందిన వారు, వీరికి ముద్రాంకితాలు ఉంటాయి.

గుర్జర (గుజరాతీ) బ్రాహ్మణులు 

    వీరిలో ప్రధానంగా మూడు తెగలు ఉన్నాయి. అవి:
    1. నగర గుజరాతీ బ్రాహ్మణులు (ప్రధానంగా వైష్ణవులు)
    2. బే కేదవాల్‌ గుజరాతీ బ్రాహ్మణులు (ప్రధానంగా స్మార్తులు)
    3. భేతరాడ కేదవాల్‌ గుజరాతీ బ్రాహ్మణులు (ప్రధానంగా వైష్ణవులు)

ద్రవిడ బ్రాహ్మణులు

    వీరు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. వీరిలో చాలా తెగలు ఉన్నాయి. మనకు అతి సమీపంలో ఉన్న ప్రాంతం కాబట్టి, ఇప్పటి మన రాష్ట్రంలో కొంత భాగం మద్రాస్‌ రాష్ట్రంలో భాగంగా ఉండేది కాబట్టి, వీరి ప్రభావం మనమీద అధికంగా ఉండే అవకాశం ఉంది. నుక, ఈ ద్రవిడ బ్రాహ్మణుల గురించి కొంచెం వివరంగా చూద్దాం. 

    ద్రవిడ బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు 12 ఉన్నాయి. అవి: (ప్రతీ తెగ చివరన బ్రాహ్మణులు అని చేర్చుకోవాలి.)
              1. వడమలు                  2. బృహచరణం                            3.అష్ట సహస్రమ్‌              4. వదిమలు    

              5. తిల్లై మువ్వయారతూర్‌  6. షోలియర్‌                            7. ముక్కరియర్‌              8. కనియలర్‌         

              9. కేశియార్‌                10. గురుక్కుల్‌                            11. ప్రథమ శాఖీ              12. వైష్ణవులు

    ఈ అన్ని తెగలలోనూ మరిన్ని ఉపతెగలు ఉన్నాయి.

1. వడమ ద్రవిడ బ్రాహ్మణులు 
             వీరిలో అనేక ఉపతెగలు ఉన్నాయి.
               1. వడదేశం                    2. చోళ దేశం                                  3. షవయ్యార్‌                 4. ఎన్‌జీ        

               5. అలుక్కు                   6. తన్నాయిరమ్‌                            7. ఎన్నాయిరథార్‌          8. మార్గటి    

               9. త్యున్ని                   10. దొమ్మగుంట ద్రవిడార్‌ 

2. బృహచరణమ్‌ ద్రవిడ బ్రాహ్మణులు
        1. కండ్రమణిక్కమ్‌                 2. మొలగనూర్‌ లేదా మొలగు           3. మఝవనాడు            4. సత్యమంగళమ్‌    
        5. పఝమనేరి                      6. మరుతమ్‌జేరి                              7. మోసనాడు               8. కొలత్తూర్‌   
        9.పూడూర్‌ ద్రావిడులు

3. అష్ట సహస్రమ్‌ ద్రవిడ బ్రాహ్మణులు
    ద్రవిడ బ్రాహ్మణులలో మరొక తెగ ఇది. ఇందులోనూ నాలుగు    ఉపతెగలు ఉన్నాయి. 
      1. అత్తియూర్‌                         2. అరివార్‌పాడి                              3. నందివాడి                     4.షట్కులమ్‌ బ్రాహ్మణులు

    మన తెలుగు బ్రాహ్మణులలో 'ఆరువేల నియోగులు' అన్న తెగ     ఉన్నట్లే, ద్రవిడ బ్రాహ్మణులలో 'అష్ట సహస్రమ్‌ ద్రవిడ బ్రాహ్మణులు', అంటే, 'ఎనిమిదివేల' ద్రవిడ బ్రాహ్మణులు ఉండటం విశేషం. దీనికి అదనంగా, 'షట్కులమ్‌ ద్రవిడ బ్రాహ్మణులు' ఉన్నారు. మరి, ఈ 'షట్కులమ్‌' (ఆరు కులాలు) ఏమిటో..!!


4. వతిమ ద్రవిడ బ్రాహ్మణులు
    వీరిని ఇదివరకు 'మధేమా ద్రవిడులు' అనేవారు. అంటే, మధ్య తమిళ దేశానికి చెందినవారని అర్థం. ఈ తెగ ద్రవిడ బ్రాహ్మణులలో నాలుగు ఉపతెగలు ఉన్నాయి. 

    1. పదినెట్టు గ్రామత్తియ వతిమ   2. ఉదయలూర్‌                          3. నాన్నిలమ్‌                 4. రథమంగళమ్‌ బ్రాహ్మణులు

    'పదినెట్టు గ్రామత్తియ వతిమ' అంటే పదిహేను గ్రామాలకు చెందిన వారని అర్థం. 'ఆరువేల నియోగులు' అనేది సంఖ్యాపరమైన విభజన అనుకుంటే, ఇది గ్రామపరమైన విభజన. పైగా, మనకులాగే, ద్రవిడులలోనూ ప్రాంతాలవారీగానే తెగల విభజన జరగటాన్నీ మనం గుర్తించవచ్చు.  

5. తిల్లై మువ్వయారతూర్‌ ద్రవిడ బ్రాహ్మణులు 
  ఈ తెగబ్రాహ్మణులను 'దీక్షాదర్‌'లనటం ఉంది. వీరు ప్రధానంగా చిదంబరం ప్రాంతంలో నివసించే స్మార్త బ్రాహ్మణులు. వీరిలో ఉపతెగలేవీ ఉన్నట్లుగా లేదు. ('మువ్వయారత్తూర్‌' అంటే 36 గ్రామాలా?)

6. షోలియార్‌ ద్రవిడ బ్రాహ్మణులు
    ఈ తెగ ద్రవిడ బ్రాహ్మణులలో మరొక తెగ ఇది. ఇందులో ఆరు  ఉపతెగలు ఉన్నాయి. 
        1. తిరుకట్టియూర్‌               2. మాడలూర్‌                         3. విసాలూర్‌                        4. పూతలూర్‌          

        5. సెంగనూర్‌                     6. అవదయార్‌ కోవిల్‌ షోలియార్‌ ద్రవిడ బ్రాహ్మణులు
    ఇక, 7. మక్కనియార్‌, 8. కనియలార్‌, 9. కేశియార్‌, 10. గురుక్కుల్‌, 11. ప్రథమ శాఖీయ ద్రవిడ బ్రాహ్మణులలో ఉపతెగలు లేవు. 

12. వైష్ణవ ద్రవిడ బ్రాహ్మణులు
    ద్రవిడ బ్రాహ్మణులలో ఒక ప్రధానమైన తెగ ఇది. వీరిని 'అయ్యంగార్‌'లు అనటం ఉంది. వైష్ణవ ద్రవిడ బ్రాహ్మణులలో అనేక తెగలు ఉన్నాయి. అవి: 
      1. వడకళి                           2. తెంగళి                             3. షోలియ తెంగల్యార్‌           4. ఆంధ్ర వడకళి వైష్ణవ బ్రాహ్మణులు 
      5. ఆంధ్ర తెంగళి వైష్ణవ బ్రాహ్మణులు

వడకళి ద్రవిడ వైష్ణవ బ్రాహ్మణులు: వీరిలోనూ అనేక ఉపతెగలు ఉన్నాయి. అవి: 1. వడకళయార్‌, 2. ప్రథమ శాఖీయ, 3. వైఖానస అర్చక, 4. హెబ్బార్‌. వీరిలో వైఖానస అర్చకులు, వైష్ణవ ఆలయాలలో వైఖానస పంచరాత్ర ఆగమం ప్రకారం అర్చనలు చేసేవారు కాగా, హెబ్బార్‌లు మైసూర్‌ ప్రాంతానికి చెందినవారు.

తెంగళి ద్రవిడ వైష్ణవ బ్రాహ్మణులు:

వీరిలోనూ మనకు 1. ప్రథమ శాఖీయ, 2. హెబ్బార్‌, 3. వైఖానస అర్చక తెగలతోబాటు అదనంగా 4. బహుగోత్రయార్‌, 5. సప్త గోత్రయార్‌, 6. అష్ట గోత్రయార్‌, 7. మాండయం ద్రవిడ బ్రాహ్మణ ఉపతెగలు ఉన్నాయి. 

షోలియ తెంగల్యార్‌ ద్రవిడ వైష్ణవ బ్రాహ్మణులు:

ఈ తెగలో      
     1. తిరువళ్లరాయ్‌ షోలియర్‌, 2. సొక్కలార్‌,                         3. తిరుకొట్టియూరర్‌,          4. పెరుంగరనాయర్‌,

     5. పాట్టకులత్తర్‌,                 6. తిరుకణ్ణమంగయార్‌,           7. తిరున్నారాయణపురత్తర్‌, 8. మండల కొట్టయార్‌,

     9. రాజసింగ మంగళతర్‌,    10 ఉతత్తురార్‌                        11. వైష్ణవ అర్చకర్‌ అనే ఉపతెగలున్నాయి. 

    ఇక, ఈ వైష్ణవ ద్రవిడ బ్రాహ్మణులలో ఉన్న మరో రెండు తెగలు - ఆంధ్ర వైష్ణవ తెంగళి ద్రవిడులు, ఆంధ్ర వైష్ణవ వడకళి బ్రాహ్మణులు. 

దక్షిణ భారత దేశంలోని వివిధ బ్రాహ్మణ తెగలలో మనం ఇప్పటివరకూ కర్నాటక, మహారాష్ట్ర, గుర్జర, ద్రవిడ బ్రాహ్మణుల వివరాలను స్థూలంగా చూశాం. ఇక మిగిలింది తెలుగు బ్రాహ్మణుల విషయం మరో పేజీలో చూడండి.