hinduBrahmins

బి. ఎం. శాస్త్రి
బి. ఎం. శాస్త్రి - సుప్రసిద్ధ పరిశోధకులు.  వారి పేరు భిన్నూరి నరసింహ శాస్త్రి. వీరు 'మూసీ' పత్రిక సంపాదకులు. శాసన పరిష్కరణలో నిపుణులు. బ్రాహ్మీ వంటి ప్రాచీన లిపులను చదువుటలో, ఇతిహాస నిర్మాణంలో పరిణత ప్రజ్ఞులు . 12 శాసనసంపుటాలను సవివరణగా ప్రచురించారు. భారతదేశ సంస్కృతిని 30 సంపుటాలలో రాయడానికి పూనుకుని, 21 సంపుటాలను ప్రచురించారు. తక్కిన 9 సంపుటాలను కూడా ప్రచురణకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల సర్వస్వాలను, రెడ్డిరాజ్య సర్వస్వాన్ని ప్రచురించారు. బ్రాహ్మణరాజ్య సర్వస్వాన్ని ప్రచురించారు. 
'విప్లవజ్వాల', 'వాకాటక మహాదేవి', తుక్కా దేవి', 'రాధ', 'జీవితం గమనం', 'సంధ్యారాగం'వంటి సామాజిక చారిత్రక నవలలు ప్రచురించారు. వీరి వందలాది పరిశోధన వ్యాసాలు 'భారతి' వంటి పత్రికలలో ప్రచురితం అయ్యాయి. ఆంధ్రదేశ చరిత్ర- సంస్కృతిని, ఆంధ్రుల సాంఘిక చరిత్రను 3 సంపుటాలలో ప్రచురించారు. 
వీరిది నల్గొండ జిల్లా, వలిగొండ గ్రామము . అక్కడ వీరు త్రిశక్తిహరిహర దేవాలయ సముదాయాన్ని చాలా వ్యయప్రయాసలకోర్చి నిర్మించారు. కవులకు, రచయితలకు అనేక గుప్తదానాలు చేసిన ఉదారులు. వీరు రాసిన పుస్తకాలు అనేకం.