hinduBrahmins

అక్కన్న - మాదన్న 
అక్కన్న, మాదన్నలు అన్నదమ్ములు. గోల్కొండ నవాబులు కులీ కుతుబ్ షాలలో చివరివాడైన అబుల్ హాసన్ తానాషా (తానీషా) కొలువులో ఉద్యోగులు. వీరిది హనుమకొండ. అక్కడ సుంకాధికారి (టాక్స్ ఆఫీసర్) పింగళి భానూజి కుమారులు. అక్కన్న, మాదన్నలతోబాటు ఆయనకు మరో ఇద్దరు కుమారులూ ఉండేవారు. వారి పేర్లు విశ్వనాథుడు, మృత్యుంజయుడు. 

అక్కన్న, మాదన్నలు ఇద్దరూ గోల్కొండకు వచ్చి, అక్కడ సయ్యద్ ముజఫర్ అనే సేనాపతి వద్ద గుమాస్తాలుగా చేరారు. అప్పటి గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా 1673లో చనిపోవటంతో, ఆయన మూడవ కుమార్తె భర్త అయినా అబుల్ హాసన్ తానాషా 
గోల్కొండకు సుల్తాన్ అయినాడు. తన మామగారివద్ద మంత్రులుగా ఉన్నవారు అంతా స్వార్థపరులు, తనకు వ్యతిరేకులు అని గుర్తించిన తానాషా, ఆ స్థానాలలో తన విశ్వసనీయులను నియమించుకోవాలని ఆశించి, అక్కన్న, మాదన్నల సలహా తీసుకున్నాడు. అయితే, మంత్రులను ఒకేమారు తొలగిస్తే ప్రమాదమని, వారిలో వారికి విభేదాలు కల్పించి, వారిని సాగనంపడం మేలని అక్కన్న, మాదన్నలు తానాషాకు సలహా ఇచ్చి, ఆ సలహాను తామే ఆచరణలో పెట్టారు. చివరికి, తానాషా, పాత మంత్రులందరికీ ఉద్వాసన పలికాక, మాదన్నను  'సూర్యప్రకాశరావు' అనే బిరుదంతో మహామంత్రిగా, అక్కన్నను 'అప్పర్ బహదూర్' బిరుదుతో సేనాధిపతిగాను సర్వాధికారాలు ఇచ్చి నియమించుకున్నాడు. అక్కన్న, మాదన్న సోదరులు, విసనాథుడి సైన్యాలకు జీతాలు ఇచ్చే 'బక్ష్ గిరి'గా, మృత్యుంజయుడు పీష్వాగా, మేనల్లుడు కంచర్ల గోపన్న భద్రాచలం తాసిల్దారుగా ఉద్యోగాలు పొందారు. ఈ కంచర్ల గోపన్నే భద్రాచల 'రామదాసు'గా జగత్ప్రసిద్ధుడు. 

బ్రాహ్మణులలో నియోగి బ్రాహ్మణులకు ఈ సోదరులే ఆదివాక్యం పలికారని ఒక కథనం ఉంది.